Friday, April 26, 2024

Awards – శాకుంత‌లం సంచ‌ల‌నం – కేన్స్ ఫిలీం ఫెస్టివ‌ల్లో నాలుగు అవార్డులు కైవ‌సం..

ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ‘శాకుంతలం’ తొలిరోజే డిజాస్టర్‌ టాక్ మూటగట్టుకుంది. అయితే ఈ మూవీకి కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్స్ సినిమాకు ఏకంగా నాలుగు విభాగాల్లో అంత‌ర్జాతీయ‌ అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ ఫారిన్ ఫిల్మ్, బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ కాస్ట్యూమ్‌ డిజైన్, బెస్ట్ ఇండియన్ ఫిల్మ్ కేటగిరీల్లో శాకుంతలం సినిమా నాలుగు అవార్డులను గెలుచుకుంది. గతంలో ఈ సినిమాకు న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ అవార్డ్స్ 2023లో బెస్ట్ ఫాంటసీ ఫిల్మ్, బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్ కేటగిరిల్లో రెండు అవార్డులను గెలుచుకుంది. కాళీదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించిన ఈ మూవీలో సమంత శాకుంత‌ల‌గా, దుష్యంతుడుగా మలయాళ నటుడు దేవ్‌ మోహన్ న‌టించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement