Monday, June 17, 2024

Arrested | హ‌త్య కేసులో క‌న్న‌డ హీరో ద‌ర్శ‌న్ అరెస్ట్..

ప్రముఖ కన్నడ హీరో దర్శన్‌ తూగుదీపను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక హత్యకేసులో భాగంగా మైసూరులో ఆయనతో పాటు మరో పదిమందిని బెంగళూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. బెంగళూరులోని సుమనహళ్లి బ్రిడ్జి వద్ద శవమై కనిపించిన రేణుకా స్వామి హత్య కేసులో ద‌ర్శ‌న్ ఆయ‌న భార్య శ్రీలక్ష్మితో పాటు మరో 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

జూన్‌ 8న రేణుకా స్వామి అనే వ్యక్తి హత్యకి గురయ్యాడు. ఆ మరుసటి రోజు కామాక్షిపాళ్యం దగ్గర్లోని ఒక కాలువలో అతని మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో హీరో దర్శన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో దర్యాప్తు కోసం ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో తెలిసిన దాని ప్రకారం.. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన రేణుక స్వామి అనే వ్యక్తి దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ్ కి అసభ్యకర, బెదిరింపు సందేశాలు పంపినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement