Friday, May 3, 2024

అనుపమ వదిలేసినా హిట్ సినిమాలు ఇవే ?

అనుపమ పరమేశ్వరన్… ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. క్యూట్ ఎక్స్ ప్రెసెన్స్ తో ఎంతోమంది మగవాళ్ళ హృదయాలను కొల్లగొట్టింది ఈ అమ్మడు. అయితే కెరీర్ ప్రారంభించి చాలా సంవత్సరాలు అవుతున్నా… సరైన హిట్ మాత్రం తగల్లేదు. అయితే అనుపమ ప్రస్తుతం నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కార్తికేయ2 చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో అనుపమ కొన్ని సినిమాలు మిస్ చేసుకుందని మిస్ చేసుకున్న సినిమాలు అన్నీ కూడా మంచి విజయం సాధించాయని ఒక వేళ ఆ సినిమాలే గాని అనుపమ చేసి ఉంటే స్టార్ హీరోయిన్ అయ్యి ఉండేదని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

అయితే అనుపమ రిజెక్ట్ చేసిన ఆ సినిమాల లిస్టు ఇదేనని ప్రచారం చేస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్, అలాగే శర్వానంద్ హీరోగా నటించిన మహానుభావుడు, నాని హీరోగా నటించిన వి చిత్రం, అలాగే నేను లోకల్ చిత్రాలకు అనుపమ నో చెప్పేసిందట. అయితే మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ సోషల్ మీడియాలో మాత్రం ఆ ఛాన్సులు మిస్ చేసుకోకపోయి ఉంటె బాగుండేదని కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement