Saturday, April 20, 2024

నారప్ప నుంచి మరో పాట రిలీజ్

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నారప్ప. తమిళంలో స్టార్ హీరో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు రీమేక్ చిత్రం గా ఈ సినిమా తెరకెక్కుతోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా జూలై 20న అమెజాన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.

ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా మరో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నారప్ప.. నువ్వంటే ఎంతో ఇట్టంగుందోయ్ నారప్ప.. నిను సూడంగానే విప్పారిందోయ్ నారెప్ప అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటకు మణిశర్మ సంగీతం అందించగా.. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement