Thursday, April 18, 2024

ఏడాదిలో ఏడు ఫ్లాప్ లు….చిరంజీవి లేకపోతే నేను లేను – శ్రీకాంత్

ఒకానొక సమయం లో ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ ఇటీవల ఆ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాలేకపోతున్నాడు. సరైన హిట్ కొట్టి కూడా చాలా ఏళ్లు అవుతోంది. అయితే ప్రస్తుతం శ్రీకాంత్ విలన్ పాత్రలు అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడు. అయితే ఇటీవల శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ప్రారంభంలో విజయాలు అందుకున్నప్పటికీ ఆ తరువాత నిలదొక్కుకోవడానికి కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు.

ఒకే ఏడాదిలో ఏడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయని… ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో డిప్రెషన్లోకి వెళ్లి పోయాను అని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో వ్యవసాయం చేసుకోవాలా అనే ఆలోచన కు కూడా వచ్చానని కానీ.. అప్పుడు చిరంజీవి అండగా నిలిచారని తెలిపారు శ్రీకాంత్.

Advertisement

తాజా వార్తలు

Advertisement