Friday, May 3, 2024

జగదీష్ నాయుడుకు అమెజాన్ ఆఫర్ ఎంతో తెలుసా?

శివ నిర్వాణ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీష్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన రీతువర్మ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఇందులో నాని జగదీష్ నాయుడు అనే పాత్రలో కనిపించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇపుడున్న పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమా ఓటీటీ లో విడుదల చేయబోతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాకు 42 కోట్లు రూపాయలను చెల్లించి డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికార ప్రకటన కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉండనుందట. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement