Sunday, February 25, 2024

ఉపాస‌న‌కి ఊహించ‌ని గిఫ్ట్ పంపిన.. ఆలియాభ‌ట్

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌నకి గిఫ్ట్ పంపి స‌ర్ ప్రైజ్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ ఆలియాభ‌ట్. వివాహం జరిగిన పదేళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. దీనితో ప్రస్తుతం అందరి చూపు ఉపాసనపైనే ఉంది. ఆమె ఎక్కడికి వెళ్లినా ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఉపాసన ప్రస్తుతం ఈ సమయాన్ని సంతోషంగా గడుపుతోంది. కాగా ఉపాసనకు అలియా అదిరిపోయే గిఫ్ట్ పంపింది. అలియా నుంచి గిఫ్ట్ అందుకున్న ఉపాసన సంతోషం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలియా భట్ ప్రస్తుతం ‘ఈద్ ఏ మమ్మ’ అనే క్లోతింగ్ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఆ సంస్థకి సంబంధించిన పెద్ద కిట్ ని అలియా ఉపాసనకు పంపింది. ఈ కిట్ లో గర్భంతో ఉన్నవారికి అవసరమైన బట్టలు, వస్తువులతో పాటు పుట్టబోయే పిల్లలకు కావలసిన బట్టలు కూడా ఉంటాయి. ఇటీవల ఉపాసన సీమంతం వేడుకని రాంచరణ్ దుబాయ్ లో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. ప్రస్తుతం రాంచరణ్ తన భార్య పక్కనే ఉంటూ ఆమె కోసం సమయం కేటాయిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement