Wednesday, May 1, 2024

అఖిల్ “ఏజెంట్” ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ చేసిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘ఏజెంట్’. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మేకర్స్. ఇదివరకు సిినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, పాటలకు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది.

ఏజెంట్ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల (ఏప్రిల్) 18న విడుదల చేయనున్నారు మేకర్స్. అఖిల్, మెగాస్టార్ మమ్ముట్టి, డినో మోరియాలను ప్రదర్శించే ప్రత్యేక పోస్టర్‌తో ఈ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పోస్టర్‌లో అఖిల్ గాయాలతో కనిపిస్తుండగా, మిగతా ఇద్దరు నటులు తుపాకులు పట్టుకుని ఉన్నారు. కాకినాడలో జరిగే ఓ ఈవెంట్‌లో ఈ ట్రైలర్‌ను భారీగా లాంచ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, సురేందర్‌ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి హిప్‌హాప్ తమిజా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో సాక్షి వైద్య అఖిల్ రొమాంటిక్ ఆసక్తిని పోషిస్తోంది. కాగా, ఈ పాన్ ఇండియన్ ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement