Thursday, May 9, 2024

అఖ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్టైనర్ ‘ఏజెంట్’.. రిటీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ న‌టిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఏకే ఎంటర్టయిన్ మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై రూపుదిద్దుకుంటోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ నేడు ప్ర‌క‌టించేసింది. ఈ మూవీ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంద‌ని వెల్లడించారు మేక‌ర్స్. ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది, సంగీత ద‌ర్శ‌కుడు ఎస్. ఎస్.థ‌మన్ సంగీతం అందిస్తున్నారు.

కాగా.. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో కనిపించనున్నారట‌. ఇప్పటివరకు లవర్ బాయ్ పాత్ర‌ల్లో నటించిన అఖిల్ ఈసారి యాక్షన్ చిత్రంతో స‌రికొత్త‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ద‌మ‌య్యాడు. ఇందులో అఖిల్ సిక్స్ ప్యాక్ తో దర్శనమివ్వనున్నాడు. దీనికి సంబంధించిన స్టిల్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement