Saturday, May 4, 2024

హెల్త్ టిప్స్ తో పాటు మోటివేషనల్ కోట్స్ యాడ్ చేసిన.. నిహారిక‌

గ‌త కొన్నిరోజులుగా న‌టి..నిర్మాత నిహారిక విడాకుల వార్త‌లు గుప్పుమంటున్నాయి. కాగా నిహారిక భర్త వెంకట చైతన్య పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన నేపథ్యంలో ఈ పుకార్లు తెరపైకి వచ్చాయి. ఈ వాదనలకు బలం చేకూర్చుతూ నిహారిక సైతం పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ నుండి తొలగించారు. నిహారిక-వెంకట చైతన్య విడాకులు ఖాయమేనని చిత్ర వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. నిహారిక విడాకుల పుకార్లపై న‌టుడు నాగబాబు సైతం మాట్లాడలేదు. ఆయన మౌనం వహించారు. సాధారణంగా తన కుటుంబ సభ్యుల మీద వచ్చే ఆరోపణలను నాగబాబు సహించరు. వెంటనే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కూతురు లైఫ్ మేటర్ లో మాత్రం నాగబాబు సైలెంట్ గా ఉండిపోయారు.

నిహారిక ఈ మధ్య కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేశారు. నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ఆమె పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ బ్యానర్ లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ మూవీస్ నిర్మిస్తున్నారు. తన నిర్మాణ సంస్థను ఆమె మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు. ఇందు కోసం ఓ ఆఫీస్ ఓపెన్ చేశారు. నిహారిక లేటెస్ట్ వీడియో వైరల్ అవుతుంది. ఆమె వ్యాయామం చేస్తున్న వీడియో పంచుకున్నారు. ఆ వీడియోకి ఆమె కొన్ని కామెంట్స్ జోడించారు. హెల్త్ టిప్స్ తో పాటు మోటివేషనల్ కోట్స్ యాడ్ చేశారు. అలాగే అన్ని గాయాలకు కాలమే సమాధానం చెబుతుందని ఆమె ఓ పాయింట్ ఆ వీడియోలో జోడించారు. ఇవన్నీ చూస్తుంటే విడాకుల బాధ నుండి బయటపడేందుకు నిహారిక ప్రయత్నం చేస్తున్నారనిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement