Thursday, May 9, 2024

Big Breaking | RRRలో బ్రిటిష్ ఎంప‌ర‌ర్ రే స్టీవెన్‌స‌న్ ఇక‌లేరు..

RRR సినిమాలో బ్రిటిష్ ఎంప‌రర్ స్కాట్ గా ప్రధాన పాత్ర పోషించిన రే స్టీవెన్‌సన్ ఇక లేరు. 58 ఏళ్ల వయసులో ఆయ‌న ఇవ్వాల (సోమ‌వారం) మరణించారు. అయితే ఆయ‌న ఎలా చ‌నిపోయార‌న్న‌ది మాత్రం తెలియ‌రాలేదు. ఈ సినీ నటుడు తన కెరీర్‌లో అనేక బహుముఖ పాత్రలను పోషించారు. పనిషర్: వార్ జోన్, ది థోర్ చలనచిత్రాలు, టెలివిజన్ సిరీస్ రోమ్, స్టార్ వార్స్: రెబెల్స్‌లో స్టీవెన్‌సన్ తన పాత్రలకు ప్రసిద్ధి చెందారు. అయితే అతను తన పుట్టినరోజుకు కేవలం 2 రోజుల ముందు చ‌నిపోవ‌డం చాలా హృదయ విదారకంగా ఉందని సినీ వ‌ర్గాలు, అభిమానులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement