Sunday, May 5, 2024

హాట్ స్టార్ సబ్ స్క్రైబర్లకు షాక్.. నెట్‌ఫ్లిక్స్ బాట‌ప‌ట్టిన‌ డిస్నీ

దేశంలో అత్యధిక సబ్ స్రైబర్లను కలిగి ఉన్న దిగ్గజ ఓటీటీ స్ట్రీమింగ్ సంస్థ ఈయిన‌ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కీలక నిర్ణయం తీసకున్నట్లు తెలుస్తోంది. ఇకపై కేవ‌లం నాలుగు డివైస్ లలోనే లాగిన్ అయ్యేలా పరిమితి విధించనున్న‌ట్టు తెలుస్తోంది. పాస్ వర్డ్ షేరింగ్ ను నియంత్రించేందుకు కూడా ఓ పాలసీని తీసుకురానుంది. ప్ర‌స్తుతం దేశంలో డిస్నీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న నెట్‌ఫ్లిక్స్ ఈ ఏడాది మే నెలలో తన సబ్ స్క్రైబర్లకు ఇలాంటి ఒక‌ కొత్త రూల్ ను తీసుకొచ్చింది. కుటుంబసభ్యులు కాకుండా వేరే వ్యక్తులతో పాస్ వర్డ్ ను షేర్ చేసుకునేవారు సబ్ స్క్రిప్షన్ ఫీజు అధికంగా చెల్లించే విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు డిస్నీ కూడా ఇదే విధానాన్ని ఫాలో అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement