Thursday, May 2, 2024

అక్క మా ముఖాలు చూపించలేక పోతున్నాము… అలాంటి ఫోటోలు పెట్టొద్దు – విష్ణు ప్రియకు రిక్వెస్ట్

యాంకర్ విష్ణు ప్రియ గురించి తెలుగు సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే విష్ణు ప్రియ… హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ సెగలు రేపుతూ ఉంటుంది. అయితే తాజాగా ఫోటో షూట్ చేసిన ఈ అమ్మడు కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అవి చూసిన ఓ అభిమాని విష్ణుప్రియ కు ఓ రిక్వెస్ట్ చేసారు.

అక్క మా ముఖం చూపించలేకపోతున్నాము. చూడు మీ ప్రియ ఎలాంటి ఫిక్స్ పెడుతుందో అని అడుగుతున్నారు. కాస్త పద్ధతిగా దిగి ఫోటోలు షేర్ చెయ్ అక్క అంటూ దియా అనే అభిమాని విష్ణుప్రియకు రిక్వెస్ట్ చేసింది. అయితే ఆ విషయమై స్పందించిన విష్ణుప్రియ రాయిలో కూడా దేవుడిని చూడొచ్చు… చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. నా ప్రొఫెషన్ లో రకరకాల దుస్తులు ధరించి కనిపించాల్సి ఉంటుంది. ఇది అర్థమైతే బాగుంటుంది. లేదంటే ఈ విషయాన్ని అర్థం చేసుకుని శక్తి ఆ భగవంతుడు నీకు ఇవ్వాలి అంటూ రిప్లై పెట్టింది విష్ణు ప్రియ.

Advertisement

తాజా వార్తలు

Advertisement