Thursday, November 14, 2024

18 పేజెస్ ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది !!

లాంగ్ గ్యాప్ తర్వాత అర్జున్ సురవరం సినిమాతో హిట్ ని అందుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమా చేస్తున్నాడు. అలాగే 18 పేజెస్ సినిమా కూడా చేస్తున్నాడు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

కాగా తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ అనౌన్స్మెంట్ పై చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఒకపక్క చేతిలో ఫోన్ పట్టుకుని బ్యాక్ గ్రౌండ్ లో టెక్నాలజీ ని చూపిస్తూ మరోవైపు చేతిలో పెన్ పట్టుకుని ఒక పేజీ పై రాస్తున్నట్లు గా చూపించారు. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను వచ్చే జూన్ 1వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement