Thursday, April 25, 2024

మహేష్ బర్త్ డే బ్లాస్టర్ కి 1మిలియన్ లైక్స్….35 మిలియన్ల వ్యూస్

సూపర్ స్టార్ మహేష్ బాబు… పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాట సినిమా నుంచి బర్తడే బ్లాస్టర్ పేరుతో టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఒక్క యూట్యూబ్ లో 35 మిలియన్ల వ్యూస్ ని దక్కించుకొని వన్ మిలియన్ లైక్స్ ను సొంతం చేసుకుంది.

బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, 14 రీల్స్ ప్లస్ వారు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement