Monday, June 17, 2024

కోర మీసాలతో స్మార్ట్ గా ‘ప్రభాస్’

కొత్త లుక్ లో మెరిశారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఆయన పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. రాధేశ్యామ్..సలార్..ఆదిపురుష్ చిత్రాలతో బిజీ బిజీగా మారారాయన. తాజాగా బయటకు వచ్చిన ప్రభాస్ లుక్ ఒకటి బాగా వైరల్ అవుతోంది. కోర మీసాలతో స్మార్ట్‌లుక్‌తో ప్రభాస్ ఆకట్టుకుంటున్నాడు. ఆదిపురుష్ లోని రాముడి పాత్ర కోసమే ప్రభాస్ మీసకట్టు మార్చాడని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ ఏడాది రాధేశ్యామ్ సినిమాతో ఫ్యాన్స్‌ను ప్రభాస్ పలకరించనున్నాడు. జూలై 30న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్ అలరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement