Sunday, April 21, 2024

‘వకీల్ సాబ్’ నుంచి రేపు మరో లిరికల్ సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘వకీల్ సాబ్’ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. బుధవారం సాయంత్రం 5 గంటలకు ‘సత్యమేవ జయతే’అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. బాలీవుడ్‌లో సూపర్ హిట్ చిత్రం ‘పింక్’కు రీమేక్‌గా ‘వకీల్ సాబ్’ తెరకెక్కుతోంది. బోనీకపూర్, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్, అంజలి, నివేదా థామస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ‘మగువా’ లిరికల్ సాంగ్ సూపర్ డూపర్ హిట్టయింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అంమెజాన్ ప్రైమ్, శాటిలైట్ క్కులను జీ తెలుగు ఛానల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement