Sunday, April 21, 2024

మే 7న’నూటొక్క జిల్లాల అందగాడు’

రాచ‌కొండ విద్యాసాగ‌ర్ డైరెక్టర్‌గా ప‌రిచ‌యం అవుతున్నచిత్రం నూటొక్క జిల్లాల అందగాడు. టాలీవుడ్‌లో డిఫ‌రెంట్ మూవీస్‌లో న‌టుడిగా, సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా, రైట‌ర్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న అవ‌స‌రాల శ్రీనివాస్ హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా త‌న‌దైన కామెడీ పంచుల‌తో ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేసేలా మంచి ఎంట‌ర్‌టైనింగ్ క‌థ‌ను అందించారు. ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుందని, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయని చిత్రయూనిట్‌ ప్రకటించింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మే 7న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. అవ‌స‌రాల శ్రీనివాస్ సరసన రుహ‌నీ శ‌ర్మ(చి.ల‌.సౌ, డర్టీ హరి ఫేమ్‌) హీరోయిన్‌గా నటిస్తోంది.శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై  దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగ‌ర్ల‌మూడి నిర్మిస్తోన్న చిత్రం ‘నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు’. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను అందించాల‌నే ఆలోచ‌న‌తో ఉన్న తన వ‌ద్ద‌కు డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో వ‌స్తే నిర్మాత‌గా త‌న వంతు స‌హకారం అందించి నిర్మాణంలో భాగ‌స్వామిన‌వడానికి సిద్ధంగా ఉన్నానని.. ఇటీవ‌ల‌ దిల్‌రాజు చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు  వైవిధ‌మ్యైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించే ద‌ర్శ‌కుడు క్రిష్‌తో చేతులు క‌లిపారు. వీరిద్దరి కాంబినేష‌న్‌లో ఈ చిత్రం రూపొందుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement