Thursday, April 18, 2024

లక్నో : దేశంలో ఉరి కంబం ఎక్కున్న తొలి మహిళ షబ్నమ్…ఇంతకీ ఆమె ఎవరు? ఏం చేసింది?

దేశంలో తొలిసారిగా ఒక మహిళ ఉరికంబం ఎక్కబోతున్నది. ఆమె పేరు శోభన. ఆమెకు మథురైలోని జైలులో ఉరి శిక్ష అమలు చేయడానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఆమె స్వస్థలం ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహ.ఉన్నత చదువులు చదువుకున్న ఆమె ప్రియుడితో కలిసి ఏడుగురిని అత్యంత దారుణంగా హత్య చేసింది. ఆ ఏడుగురూ కూడా ఆమె కుటుంబ సభ్యులే. ఆమె చేతిలో హతమైన వారిలో ఓ చిన్నారి కూడా ఉంది. ఈ దారుణ ఘాతుకానికి ఆమె 2008 ఏపిల్ నెలలో పాల్పడింది. గొడ్డలితో సొంత కుటుంబ సభ్యులనే కర్కశంగా నరికేసింది. కాగా కింది కోర్టు తనకు విధించిన శిక్షను షబ్ మన్ సుప్రీంలో సవాల్ చేసింది. అయితే సుప్రీం కోర్టు కూడా కింది కోర్టు ఇఛ్చిన తీర్పునే ఖరారు చేసింది. దీంతో ఆమెకు ఉరి శిక్షను అమలు చేయడానికి జైలు అధికారులు సమాయత్తమౌతున్నారు. తేదీ ఖరారు కావడమే తరువాయి. ఆమెకు మథురై జైలులో ఉరి తీస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement