Friday, May 3, 2024

బ్లూ టిక్‌పై ట్విటర్‌ యూటర్న్‌.. సబ్‌స్క్రిప్షన్‌ నిలిపివేత

ఆదాయం పెంచుకోవడం కోసం ట్విటర్‌ తీసుకు వచ్చిన బ్లూటిక్‌ సర్వీస్‌ను నిలిపివేసింది. ట్విటర్‌ను కొనుగోలు చేసిన కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ బ్లూ టిక్‌ కోసం నెలవారి సబ్‌స్క్రిప్షన్‌ విధానం తీసుకు వచ్చారు. అమెరికాలో నెలకు 8 డాలర్లు ఫీజుగా నిర్ణయించారు. మన దేశంలో 719 రూపాయలతో ఈ సర్వీస్‌ ప్రారంభించారు. ట్విటర్‌ కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ బ్లూ టిక్‌ విధానాన్ని ప్రకటించిన నాటి నుంచే నెటిజన్లు ఆయనపై విమర్శలు, ట్రోల్స్‌తో నిరసన వ్యక్తం చేస్తున్నారు.

బ్లూ టిక్‌ ఆఫ్షన్‌ ప్రవేశపెట్టడంతో నకిలీ ఖాతాలు భారీగా పెరిగాయి. దీంతో ట్విటర్‌ దీన్ని నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వార్త కథనాలు రాశాయి. బ్లూ టిక్‌ ఆఫ్షన్‌ శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించడంలేదని మీడియా వార్తలు పేర్కొన్నాయి. బ్లూ టిక్‌ రావడం తో భారీగా నకిలీ ఖాతాలు పెరిగాయి. ప్రముఖ బ్రాండ్లు, కంపెనీల పేరుతో నకిలీ ఖాతాదారులు బ్లూ టిక్‌ సర్వీస్‌కు సబ్‌స్క్రిప్షన్‌ చెల్లించి దీన్ని పొందుతున్నారు. దీంతో ఏది నకిలీనో, ఏది అసలైనదో తెలుసుకోలని పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్విటర్‌ ఈ సర్వీస్‌ను తొలగించింది.

ట్విటర్‌ మరో వైపు అధికారిక అనే ట్యాగ్‌ను తీసుకు వచ్చింది. వెరిఫైడ్‌ ఖాతాల కింద ఉదారంగులో ఆఫీషియల్‌ అనే ట్యాగ్‌ను జత చేసింది. ఈ ట్యాగ్‌ను నాలుగు రోజుల క్రితమే తీసుకు వచ్చినప్పటికీ, దీనిపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి తీసుకుంది. అయితే శుక్రవారం నుంచి మళ్లి అధికారిక అనే ట్యాగ్‌ను ప్రవేశపెట్టింది. ఇది పరిమితంగానే ఈ ట్యాగ్‌ను ఇస్తోంది. అమెజాన్‌, నైక్‌, కోకాకోలా గూగుల్‌ వంటి కొన్ని దిగ్గజ కంపెనీల ఖాతాలకు మాత్రమే ఈ ట్యాగ్‌ను ప్రస్తుతం ఇచ్చింది. సెలబ్రేటీలు, ప్రభుత్వ ఖాతాలకు ఇంకా దీన్ని జత చేయలేదు. అధికారిక ట్యాగ్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ట్విటర్‌లో బ్లూ టిక్‌ సర్వీస్‌ను పూర్తిగా నిలివేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

- Advertisement -

ట్విటర్‌ ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేసిన చేసిన నాటి నుంచి సంస్థలో పూర్తి స్థాయి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగులను తొలగించడంతో ప్రారంభమైన ఈ గందరగోళం బ్లూ టిక్‌కు సబ్‌స్క్రిప్షన్‌ ప్రవేశపెట్టడంతో తారా స్థాయికి చేరుకుంది. మరో వైపు ట్విటర్‌ దివాళ అంచున ఉందని స్వయంగా ఎలాన్‌ మస్క్‌ ప్రకటించడంతో కంపెనీకి ప్రకటనదారులు, ఇన్వెస్టర్లు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. కొనుగోలుకు రుణాలు ఇచ్చిన బ్యాంక్‌లు నష్టానికి ఆ రుణాన్ని బాండ్ల సంస్థలకు అమ్మేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని వార్తలు వచ్చాయి. ఇవన్నీ ట్విటర్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement