Friday, June 14, 2024

Ola | ఈవీల‌పై అధిరిపోయే డిస్కౌంట్.. ఈ నెలే ఆఖ‌రు !

ప్రముఖ ఈవీ టూ-వీలర్ తయారీదారు ఓలీ ఎలక్ట్రిక్ ఈ ఏడాది (2024) ప్రారంభం నుంచి వినియోగదారులకు అనేక ఆఫర్లను అందిస్తోంది. ప్రస్తుతం తన లైనప్‌లో ఆరు ఎలక్ట్రిక్ స్కూటర్లను కలిగి ఉన్న Ola Electric.. మూడు ఈవీలపై డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ డిస్కౌంట్లు ఈ నెలాఖరు (మార్చి 31) వరకు అందుబాటులో ఉంటాయి.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ లైనప్ లోని ‘‘ఓలా ఎస్ 1 ప్రో’’, ‘‘ఎస్ 1 ఎయిర్’’, ‘‘ఎస్ 1 ఎక్స్ ప్లస్’’ (3kw), లపై ఆఫర్లను ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో డిస్కౌంట్ అనంతరం..

ఎస్ 1 ప్రో రూ.1,29,999 (ఎక్స్-షోరూమ్ )
ఎస్ 1 ఎయిర్ రూ.1,04,999 (ఎక్స్-షోరూమ్ )
ఎస్ 1 ఎక్స్ ప్లస్ రూ.84,999 కు లభిస్తాయి. (ఎక్స్-షోరూమ్ )

- Advertisement -

ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారంటీ..

ఎస్1 ఎక్స్ (4 కిలోవాట్) ధర రూ.1,09,999, ఎస్1 ఎక్స్ (2 కిలోవాట్) ధర రూ.79,999, ఎస్1 ఎక్స్ (3 కిలోవాట్) ధర రూ.89,999 లుగా ఓలా ఎలక్ట్రిక్ నిర్ణయించింది. ఈ స్కూటర్స్ పై 8 సంవత్సరాలు / 80,000 కిలోమీటర్ల ఎక్స్ టెండెడ్ బ్యాటరీ వారంటీని కూడా వినియోగదారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement