Thursday, April 25, 2024

ఓలా స్కూటర్‌ రికార్డ్‌.. 24 గంటల్లో రూ.600 కోట్ల విలువైన విక్రయాలు

పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓలా స్కూటర్ అందుబాటులోకి రాగా.. సెప్టెంబర్‌ 15 నుంచి కొనుగోళ్లు ప్రారంభం అయ్యాయి. ఈ స్కూటర్‌ రెండు వేరియంట్లలో విడుదలైంది. ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రో వేరియంట్లు వేగంగా విక్రయాలు కొనసాగాయి. కేవలం 24 గంటల్లో రూ.600 కోట్ల విలువైన స్కూటర్లను విక్రయించినట్లు ఓలా తెలిపింది. ప్రతి సెకనుకు 4 స్కూటర్లను విక్రయించినట్లు సాఫ్ట్‌ బ్యాంక్‌ ఆధారిత కంపెనీ తెలిపింది. అయితే గత వారం వెబ్‌సైట్‌లో లోపాల కారణంగా ఇ-స్కూటర్‌ అమ్మకాలను వాయిదా వేయాల్సి వచ్చింది.

ఇక బుధవారం తిరిగి బుకింగ్‌ ప్రారంభించింది. ఓలా యాప్‌లో ఈ స్కూటర్‌ను బుకింగ్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే లక్షలాది మంది వినియోగదారులు తమ స్లాట్‌లను బుక్‌ చేసుకున్నారని సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా ఓలా చైర్మన్‌, గ్రూప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ భవేష్‌ అగర్వాల్‌ బ్లాగ్‌లో ఓ పోస్టు చేశారు. కేవలం 24 గంటల్లో రూ.600 కోట్లకుపైగా విలువైన స్కూటర్లను విక్రయించామని, వినియోగదారుల స్పందన అంచనాలకు మించి ఉందని అన్నారు. విడుదల కాకముందే ఈ స్కూటర్‌పై ఎన్నో అంచనాలు హల్ నెలకొని ఉన్నాయి. వీటితోపాటు ఎలక్ట్రిక్‌ వెహకిల్స్‌ బుకింగ్‌లోనూ సరికొత్త రికార్డ్‌లను నెలకొల్పింది. కేవలం రూ. 499లతో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని అందించడంతో విడుదలైన రోజే దాదాపు 1000 నగరాల్లో లక్ష ఫ్రీ బుకింగ్‌లతో రికార్డు నెలకొల్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement