Friday, May 3, 2024

న్యూ ఆల్టో కె-10.. కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో మార్కెట్లోకి

వాహన ప్రియులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఆల్టో కె-10 మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఇందులో చాలా వరకు కొత్తతరం ఫీచర్లు ఉన్నాయి. ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభం అయ్యాయిని ఆ సnంస్థ వెల్లడించింది. మొత్తంగా ఈ వాహనం ఏడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇందులో స్టాండర్డ్‌, ఎల్‌ఎక్స్‌ఐ, ఎల్‌ఎక్స్‌ఐ(ఒ), విఎక్స్‌ఐ, విఎక్స్‌ఐ(ఒ), విఎక్స్‌ ప్లస్‌, విఎక్స్‌ఐ ప్లస్‌ (ఒ) మోడళ్లున్నాయి. కొత్త మోడల్‌లో ప్రస్తుతం ఆరు రంగుల కార్లు అందుబాటులో ఉన్నాయి. మునుపటి ఆల్టో కె-10తో పోల్చిచూస్తే, ఆల్‌ న్యూ ఆల్టో పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. ముందుభాగంలో అమర్చిన గ్రిల్‌ మధ్య భాగంలో లోపలికి నొక్కబడి ఉంటుంది. దాదాపు ఫ్రంట్‌ ఫేస్‌ను కవర్‌ చేస్తుంది.

హెడ్‌ ల్యాంప్‌లు పెద్దవిగా ఉండి, ఇరుపక్కల విస్తారతను కలిగివుంటాయి. కారు లోపలి భాగంలోనూ చాలా మార్పుులు చేయబడ్డాయి. డ్యాష్‌బోర్డు మధ్యలో ఫ్లోటింగ్‌ టచ్‌స్క్రీన్‌ సౌకర్యం కూడా ఉంది. సెమి డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌తో న్యూ ఆల్టో కేబిన్‌ మరింత తాజాగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ వేరియంట్‌లో సీఎన్‌జీ అందుబాటులో లేదని, భవిష్యత్‌లో దానిపై దృష్టిసారిస్తామని మారుతి సంస్థ తెలిపింది. న్యూఆల్టో కె-10 గరిష్ట ఇంధన సామర్థ్యం 24.99 కి.మీ. దీని టర్నింగ్‌ రేడియస్‌ 4.5 మీటర్లు. నాలుగు డోర్లకు స్పీకర్లు అమర్చిబడివుంటాయి. మొత్తంగా ఇది సరికొత్త ఆల్టోగా మీ ముందుకు వచ్చింది అని మారుతి సంస్థ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement