Sunday, May 19, 2024

Mumbai | బుల్లెట్ రైలు కోసం పూర్తైన భూసేకరణ

ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు గురించి రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ కీలక అప్‌డేట్‌ వెల్లడించారు. ఇంతకాలం ఈ ప్రాజెక్టు జాప్యానికి కారణమైన ప్రధాన అడ్డంకి తొలగిందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. గుజరాత్‌, మహారాష్ట్ర, దాద్రానగర్‌ హవేలీలలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి 100శాతం భూసేకరణ పూర్తయినట్లు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సోమవారం ప్రకటించింది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అవసరమైన 1389.49 హెక్టార్ల భూమిని సేకరించినట్లు చెప్పారు. మొత్తం భూమిలో గుజరాత్‌ 951.14 హెక్టార్లు, దాద్రానగర్‌ హవేలీలో 7.90 హెక్టార్లు, మహారాష్ట్రలో 430.45 హెక్టార్లు చొప్పున సేకరించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సేకరించిన భూమికి సంబంధించిన గణాంకాలతో ఉన్న ఓ చార్ట్‌ను ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పంచుకున్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2022లోనే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ, భూసేకరణలో సమస్యల కారణంగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement