Tuesday, May 28, 2024

వెూటో జీ62 5జీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన వెూటరోలా

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : స్మార్ట్‌ఫోన్‌ రంగంలో ప్రపంచవ్యాప్తంగా అప్రతిహతంగా దూసుకుపోతున్న సంస్థ మోటరోలా. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన మోడల్స్‌ని వినియోగదారులకు అందించిన ఈ సంస్థ… ఇప్పుడు మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ని వినియోగదారులకు అందించనుంది. అది కూడా 5జీ నెట్‌వర్క్‌ని అందుకునే ఫోన్‌. మోటరోలా తన తాజా 5జీ స్మార్ట్‌ఫోన్‌ జీ సిరీస్‌లో మోటో జీ62 5జీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ని వినియోగదారులకు కేవలం రూ.16,249 ప్రత్యేకమైన ధరకు అందిస్తోంది. ఈ ఫోన్‌ ఆపరేటింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 695 5జీ ప్రాసెసర్‌ ఉంది. మోటో జి62 5జీ 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో సూపర్‌ స్మూత్‌తో వస్తుంది. అంతేకాకుండా ఇది 6.5 ఎఫ్‌హెచ్‌డి ప్లస్‌ అల్ట్రా-స్మూత్‌ డిస్‌ప్లేతో వస్తుందని ఆ సంస్థ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అమర్చారు. కాబట్టి మీరు మీ ఛార్జింగ్‌ గురించి చింతించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement