Friday, March 29, 2024

గెలాక్సీ జెడ్‌ ప్లిప్‌4, జెడ్‌ ఫోల్డ్‌4లను ప్రారంభించిన శాంసంగ్‌

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ నెక్స్ట్‌ జనరేషన్‌ అద్భుతమైన ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ జెడ్‌ ప్లిప్‌, గెలాక్సి జెడ్‌ ఫోల్డ్‌4 లను ప్రకటించింది. ఈసందర్భంగా శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ మొబైల్‌ ఎక్స్‌పీరియన్స్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ హెడ్‌ డాక్టర్‌ టీఎం రోహ్‌ మాట్లాడుతూ… తదుపరి ఫోల్డబుల్‌ ఫోన్లు తమ అత్యంత వైవిధ్య వినియోగదారుల అవసరాలను తీర్చే అసమానమైన మొబైల్‌ అనుభవాలను అందిస్తాయన్నారు.

తమ అచంచలమైన దృష్టి, పరిశ్రమ నాయకత్వం ద్వారా ఫోల్డబుల్‌ ఫోన్ల కోసం ఉత్సాహం పెరుగుతూనే ఉందన్నారు. తాము ఈ వర్గాన్ని ఒక రాడికల్‌ ప్రాజెక్ట్‌ నుండి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఆనందించే ప్రధాన పరికర లైనప్‌గా విజయవంతంగా మార్చామన్నారు. గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌4, ఆధునిక కెమెరా సాంకేతికత, శక్తివంతమైన మొబైల్‌ ప్రాసెసర్‌లతో పాటుగా, షేప్‌-షిప్టింగ్‌ డిజైన్‌, లీనమయ్యే డిస్‌ప్లేలు, పీసీ లో ఉండే మల్టీ టాస్కింగ్‌ వంటి ఫీచర్‌లను అందించడం ద్వారా శాంసంగ్‌ అత్యంత సమగ్రమైన స్మార్ట్‌ఫోన్‌ అనుభవాన్ని వినియోగదారులకు అందిస్తూ కొత్త అవకాశాలకు దారినిస్తుందన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement