Thursday, April 25, 2024

నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. ప‌లు సంస్థ‌ల‌కు భారీ లాస్‌

నిన్న‌ భారీ లాభాల‌ను కొన‌సాగించిన‌ స్టాక్ మార్కెట్లు ఇవ్వాల నష్టాలను చ‌విచూశాయి. ఈరోజు మధ్యాహ్నం వరకు మార్కెట్లు భారీ లాభాల్లోనే కొనసాగాయి. అయితే, మధుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. దీంతో ఇవ్వాల‌ ట్రేడింగ్ ముగిసే టైమ్‌కు సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 54,208కి పడిపోయింది. నిఫ్టీ 19 పాయింట్లు కోల్పోయి 16,240 వద్ద స్థిరపడింది.

ఇక‌.. బీఎస్ ఈలో టాప్ గెయిన‌ర్స్‌గా.. హిందుస్థాన్ యూనిలీవర్ (2.02%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.98%), ఏసియన్ పెయింట్స్ (1.65%), సన్ ఫార్మా (0.78%), ఐటీసీ (0.72%) వంటి సంస్థ‌లున్నాయి.. కాగా, టాప్ లూజ‌ర్స్‌గా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-4.55%), టెక్ మహీంద్రా (-2.14%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.01%), ఎల్ అండ్ టీ (-1.92%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.66%). వంటి సంస్థ‌లున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement