Sunday, June 9, 2024

గతవారం టాప్‌-5 సంస్థల మార్కెట్‌ క్యాప్‌ రూ.86,234కోట్లు వృద్ధి

గతవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత టాప్‌- 10 సంస్థల్లో ఐదింటి మార్కెట్‌ క్యాపిటలైజేసన్‌ రూ.86,234.73 కోట్లు పెరిగింది. వాటిల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) భారీగా లబ్ధి పొందింది. టీసీఎస్‌తోపాటు హెచ్డిఎఫ్సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, హిందూస్థాన్‌ యూనీ లివర్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ లాభ పడ్డాయి. మరోవైపు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, భారతీయ స్టేట్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ నష్టపోయాయి. గత వారం బీఎస్‌ఈ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 167.2 పాయింట్లు లాభ పడింది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.32,730.22 కోట్లు పుంజుకుని రూ.13,24,649.78 కోట్లకు చేరుకోగా, బజాజ్‌ ఫైనాన్స్‌ ఎం-క్యాప్‌ రూ.21,697.96 కోట్లు పెరిగి రూ.4,94,884.37 కోట్ల వద్ద స్థిరపడింది. అదేవిధంగా మరో దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్పోసిస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.18,057.94 కోట్లు పెరిగి రూ.6,13,655.04 కోట్ల వద్ద ముగిసింది.

హిందూస్థాన్‌ యూనీ లివర్ (హెచ్‌యూఎల్‌) ఎం-క్యాప్‌ రూ.7,730.16 కోట్లు లాభంతో రూ.5,87,104.12 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎం-క్యాప్‌ రూ.6,018.45 కోట్ల లబ్ధితో రూ.11,63,164.31 కోట్ల వద్ద నిలిచింది. మరోవైపు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.19,336.49 కోట్లు నష్టంతో రూ.15,68,216.88 కోట్లతో సరిపెట్టుకున్నది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎం-క్యాప్‌ రూ.4,671.54 కోట్ల పతనంతో రూ.6,62,057.43 కోట్ల వద్ద ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement