Monday, April 29, 2024

కొటక్‌ గ్రూప్‌లో కీలక మార్పు.. సీఈఓగా ఉదయ్‌ కొటక్‌ కుమారుడు జై కొటక్‌

న్యూఢిల్లి : ముంబై ప్రధాన కేంద్రంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెగ్మంట్‌లో అగ్ర స్థానంలో కొనసాగుతోన్న కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌ టాప్‌ లెవల్‌లో కీలక మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా ఉన్న ఉదయ్‌ కొటక్‌.. తన పదవి నుంచి తప్పుకోబోతున్నారని సమాచారం. ఆయన కుమారుడు, హార్వర్డ్ యూనివర్సిటీ ఆలమ్నీ జై కొటక్‌ ఇక సంస్థ అధిపతిగా బాధ్యతలను స్వీకరిస్తారనే ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం జై కొటక్‌.. 811 కో-హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. జూన్‌ 2వ తేదీన నిర్వహించనున్న ఇన్వెస్టర్ల సమావేశంలో ఉదయ్‌ కొటక్‌.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఆసియాలోనే అత్యంత ధనిక బ్యాంకర్‌..

తన కుమారుడు జై కొటక్‌ను సంస్థ వీసీ అండ్‌ సీఎండీగా పరిచయం చేస్తారని సమాచారం. ఆసియాలోనే అత్యంత ధనిక బ్యాంకర్‌గా కొటక్‌ కుటుంబానికి పేరు ఉంది. దీర్ఘ కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉయద్‌ కొటక్‌.. తన కుమారుడికి ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని అప్పగించనున్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆదేశాల మేరకు ఇటీవలే కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. బ్యాంకింగ్‌ సంస్థలకు 15 సంవత్సరాలపాటు పని చేసిన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు తప్పుకోవాల్సి ఉంటుందనేది ఈ మార్గదర్శకాల సారాంశం.

రేసులో కేవీఎస్‌ మణియన్‌..

ఇప్పటికే ఉదయ్‌ కొటక్‌.. 18 ఏళ్ల పాటు కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ అధిపతిగా కొనసాగారు. రిజర్వ్ బ్యాంక్‌ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఆయన తప్పుకోవాల్సి ఉంటుంది. తన స్థానంలో జై కొటక్‌ను నియమించడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ హెడ్‌గా ఉదయ్‌ కొటక్‌ కాలపరిమితి 2023 డిసెంబర్‌లో ముగియాల్సి ఉంది. ఆయన తరువాత కేవీఎస్‌ మణియన్‌ అపాయింట్‌మెంట్‌ అవుతారని విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పుడు తాజా అంచనాల ప్రకారం.. వచ్చే సంవత్సరం వరకు ఉదయ్‌ కొటక్‌ వీసీ అండ్‌ సీఈఓ బాధ్యతల్లో ఉండకపోవచ్చు అని, వైదొలగడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. తన స్థానంలో జై కొటక్‌ను నియమిస్తారని చెబుతున్నారు.

- Advertisement -

అర్హతలు ఉన్న జై కొటక్‌..

ఇన్వెస్టర్లతో నిర్వహించే సమావేశాల్లో జై కొటక్‌ చాలా యాక్టివ్‌గా కనిపించారని, భవిష్యత్‌ సీఈఓగా బాధ్యతలను చేపట్టడానికి తగిన అర్హతలు ఆయనకు ఉన్నాయనే అభిప్రాయాలు కలుగజేశారని జెఫ్పెరిస్‌ అనలిస్ట్‌ ్స ప్రాఖర్‌ శర్మ, అభిషేక్‌ ఖన్నా, భాస్కర్‌ బసు అభిప్రాయపడ్డారు. ఇటీవలే కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ టాప్‌ మేనేజ్‌మెంట్‌ లెవల్‌లో కొన్ని మార్పులు చేసింది. రిటైల్‌ బిజినెస్‌ హెడ్‌గా ఉన్న శాంతి ఏకాంబరాన్ని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా అపాయింట్‌ చేసింది. 2021లో జై కొటక్‌ 811 టీమ్‌లో అపాయింట్‌ అయ్యారు. దీనికి మనీష్‌ అగర్వాల్‌ బిజినెస్‌ హెడ్‌గా పని చేస్తున్నారు. సరిగ్గా ఏడాది తరువాత అంటే.. ఈ సంవత్సరం జనవరిలో జై.. ఈ వింగ్‌కు కో హెడ్‌గా నియమితులయ్యారు. శాంతి ఏకాంబరం సారథ్యంలో ఈ విభాగాన్ని మనీష్‌ అగర్వాల్‌-జై కొటక్‌ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారని టాప్‌ మేనేజ్‌మెంట్‌ విశ్వసిస్తోంది. ఆ అనుభవంతోనే వీసీ అండ్‌ సీఈఓగా బాధ్యతలను తీసుకుంటారని అంటున్నారు విశ్లేషకులు. జై కొటక్‌ ఇదివరకు గోల్‌ ్డమన్‌ సాచ్స్‌.. మెక్‌కిన్సె అండ్‌ కంపెనీలో కీలక హోదాల్లో పని చేశారు. హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. కొలంబియా యూనివర్సిటీలో బీఏ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement