Saturday, June 1, 2024

JIO | ఓటీటీ ప్రియులకు జియో 50శాతం ఆఫర్…

ఓటీటీ ప్రియులకు జియో టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్‌ శుభవార్త చెప్పింది. ఓ సరికొత్త ప్రీమియం వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. గతంలో రూ.999 ధరతో అందించిన వార్షిక ప్లాన్‌ మాదిరి ప్రయోజనాలు ఈ సరికొత్త ప్లాన్‌లో కూడా అందించనుంది.

ఇప్పుడు తీసుకొచ్చిన కొత్తప్లాన్‌ ద్వారా ఎలాంటి ప్రకటనలు లేకుండా 4కే రిజల్యూషన్‌తో స్ట్రీమింగ్‌ వీడియోను ఆస్వాదించొచ్చు. వాస్తవానికి ఈ ప్లాన్‌ వార్షికధర రూ.599. అయితే ప్రారంభ ఆఫర్‌ కింద దీనిని రూ.299కే అందిస్తున్నారు. అంటే 50శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌ లభిస్తోంది.

మొదటి 12నెలల బిల్లింగ్‌ సైకిల్‌ ముగిశాక సబ్‌స్క్రిప్షన్‌ కావాలంటే పూర్తి మొత్తంలో రీచార్జి చేయాల్సి ఉంటుంది. ఏడాది పొడవునా ఒక డివైజ్‌లో ఎలాంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా కంటెంట్‌ను వీక్షించొచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకుని ఆఫ్‌లైన్‌లోనూ కంటెంట్‌ను ఆస్వాదించొచ్చు.

అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నమెంట్‌, ఇతర క్రీడలు, ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలు మాత్రం ప్రకటనలతోనే వస్తాయి. ఇటీవల జియో రూ.29, రూ.89తో (ఫ్యామిలీ ప్యాక్‌) రెండు కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్లను తీసుకొచ్చింది.

ఇవి నెలవారీ ప్లాన్లు. సినిమాలు, హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్లు, పిల్లల షోలు, టీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను స్మార్ట్‌ టీవీసహా ఏ డివైజ్‌లోనైనా వీక్షించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తీసుకొచ్చిన వార్షిక ప్లాన్‌లోనూ ఈ తరహా సదుపాయాలే ఉన్నాయి. జియో గత నెలలో ప్రీమియం ఫ్యామిలీ సబ్‌స్క్రిప్షన్‌ చార్జీలను రూ.149 నుంచి రూ89కి తగ్గించింది. ఈ ప్లాన్‌లో ఒకేసారి నాలుగు డివైజ్‌లలో కంటెంట్‌ను వీక్షించొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement