Friday, April 26, 2024

రిజిస్ట్రేషన్ పక్కాగా లేకుంటే ఇబ్బందులుంట‌య్‌.. అప్రమత్తం చేస్తున్న రవాణా శాఖ

హైదరాబాద్‌,, ఆంధ్రప్రభ : ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో వాహన వినియోగం తప్పనిసరిగా మారిపోయిన విషయం తెలిసిందే. అయితే… వాహనం ఎంత అవసరమో, దానికి పకడ్బందీగా రిజిస్ట్రేషన్‌ ఉండడం కూడా అంతే అవసరం. బండి రిజిస్ట్రేషన్‌లో పొరపాట్లు, తప్పులు దొర్లినపక్షంలో… సంబంధిత యజమాని భాకీగాజరిమానా కింద చెల్లించుకోవాల్సిన పరిస్థితులుంటాయి. వాహన కొనుగోలు ఎప్పుడు జరిగింది ? పాత వాహనానికి సంబంధించిన విక్రయ వివరాలు వంటివాటిని తప్పనిసరిగా నమోదు చేయించుకోవాల్సిందేనన్న విషయం తెలిసిందే. ఏ కేటగరీకి చెందిన వాహనాన్ని విక్రయించినా కూడా… సదరు కొనుగోలుదారుడు వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయించుకునేలా కూడా జాగ్రత్త వహించడం మంచిదని రవాణా శాఖాధికారులు పేర్కొన్నారు.

అంతేకాదు… వాహనాన్ని విక్రయించిన తర్వాత… సదరు కొనుగోలుదారుడు ఏవైనా తప్పులు చేసి, దొరికిపోయినపక్షంలో… అసలు సొంతదారుడు కూడా(రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తికానిపక్షంలో)… కోర్టులో హాజరుకావాల్సిందే. కాగా… రవాణా శాఖ ఙప్పుడీ నిబంధనలను కొంత సరళీకృతం చేసింది. వాహనాన్ని విక్రయించినట్లు రుజువులు చూపించినపక్షంలో… అవి అధికారికంగా నమోదై ఉన్నపక్షంలో… సదరు యజమానికి కొంత మినహాయింపు ఉంటుంది.

కాగా గ్రేటర్‌ హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ తదితర పట్టణాల్లో… దాదాపు 20 లక్షల వరకు సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలున్నట్లు రవాణా శాఖాధికారులు చెబుతున్నారు. ఇక కొత్త వాహనం కొనుగోలు, లేదా సెకండ్‌హ్యాండ్‌ వాహనం కొనుగోలు జరిన సందర్భాల్లో… రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిస్థాయిలో సజావుగా ఉండేలా చూసుకోవాలి. వాహనానికి సంబంధించిన పత్రాల్లో చిన్న పొరపాటు దొర్లినప్పటికీ… ఎప్పుడో ఒకసారి భారీ మూల్యాలే చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అంటే… ఉదాహరణకు మన పాస్‌పోర్ట్‌ల్లో మన పేర్లు, లేదా… తండ్రి పేరు సహా అటువంటి పొరపాట్లు జరిగినపక్షంలో… ఫలితాలు ఎలా ఉంటాయో తెలిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు… వాహనాలకు సంబంధించిన పత్రాల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది.

వాహన పత్రాల్లో… స్పెల్లింగ్‌ మిస్టేక్‌లున్నా కూడా జరిమానాను ఎదుర్కోవాల్సిందే. అందుకే… సెకండ్‌ హ్యాండ్‌ వాహనమే కదా… అని నిర్లక్ష్యంగా ఉండడం సరికాదని రవాణా శాఖాధికారులు చెబుతున్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాల్లోని వివరుఆలు సరిగా లేవన్న కారణంగా… హైదరాబాద్‌ సహా ఆరు జిల్లాల్లో గత సంవత్సర కాలంలో అధికారులు దాదాపు రూ. 12 లక్షలకు పైగా జరిమానాల రూపంలో విధించారు. కాగా… ఈ జరిమానాలను చెల్లించుకోలేకపోయిన పలువురి వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు కూడా. ఇలా స్వాధీనం చేసుకున్న వాహనాలు ఆయా జిల్లాల్లో కలిపి వేల సంఖ్యలోనే ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే… సెకండ్‌ హ్యాండ్‌ వాహనమైనా సరే… క్రయవిక్రయాల్లో అన్ని జాగ్రత్తలూ తీసుకోవడం బెటర్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement