Saturday, July 27, 2024

UPI | ఇక‌నుంచి ఫ్లిప్‌కార్ట్ లో యూపీఐ సేవలు..

భారతదేశ డిజిటల్‌ ఎకానమీ ద్సష్టిని పెంచడానికి ఈకామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ తన యూపీఐ హ్యాండిల్‌ను ప్రారంభించింది. ఆదివారం యాక్సిస్‌ బ్యాంక్‌ భాగస్వామ్యంతో తన యూపీఐ సేవలను ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌ యూపీఐ సేవలు ప్రారంభంలో ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. యూపీఐ లాంచ్‌ తర్వాత సూపర్‌కాయిన్స్‌, క్యాష్‌బ్యాక్‌, మైలురాయి ప్రయోజనాలు, బ్రాండ్‌ వోచర్‌లు వంటి లాయల్టి ఫీచర్‌లు అందుబాటులోకి వస్తాయి.

ప్లిnప్‌కార్ట్‌ గత సంవత్సరం నుండి తన యూపీఐ ఆఫర్‌ను పరీక్షిస్తోంది. ఈ సేవ దాని వినియోగదారులను ఇతర అప్లికేషన్‌లకు మారకుండానే నేరుగా చెల్లింపులు చేయడానికి వీలు కల్పింస్తుంది. 2022 చివరిలో అతిపెద్ద యూపీఐ ప్లేయర్‌ అయిన ఫోన్‌పేతో విడిపోయిన తర్వాత ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పుడు యూపీఐని పరిచయం చేసింది. ప్రాధాన్య చెల్లింపు ఎంపికగా యూపీఐ అందుబాటులోకి వచ్చినందున, అసమానమైన సౌలభ్యం, జీరోకాస్ట్‌ సొల్యూషన్‌లను అందిస్తుంది. అతుకులు లేని చెల్లింపులకు వీలు కల్పిస్తుంది.

యూపీఆ చెల్లింపు విధానం ఆన్‌బోర్డింగ్‌ని సజావుగా ఎనేబుల్‌ చేస్తుంది. ప్లిnప్‌కార్ట్‌ మార్కెట్‌ప్లేస్‌ లోపల, వెలుపల ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వ్యాపార లావాదేవీల కోసం ఫీచర్‌ను సౌకర్యవంతంగా పొందేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది అని కంపెనీ తెలిపింది. ప్లిnప్‌కార్ట్‌తో భాగస్వామ్యంపై యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ మోఘే మాట్లాడుతూ, భారతదేశ అత్యంత విజయవంతమైన కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌లలో ఒకదానిని ప్రారంభించడం నుండి ఇప్పుడు ప్లిnప్‌కార్ట్‌ యూపీఐ సేవను ప్రారంభించడం వరకు చాలా దూరం ప్రయాణించాం. కస్టమర్‌లు ఇప్పుడు ఎఫ్‌కెయాక్సిస్‌ హ్యాండిల్‌తో యూపీఐ కోసం నమోదు చేసుకోవచ్చు అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement