Saturday, May 18, 2024

iPhone 14 | ఫ్లిప్‌కార్ట్ సూపర్ డీల్.. రూ.20వేల లోపే ఐఫోన్ 14

ప్ర‌ముక ఈ కామ‌ర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ ఐఫోన్ 14పై ప్రత్యేక ఆఫర్‌ అందిస్తోంది. ఈ డివైజ్‌ను రూ. 20వేల లోపు ధరకు కొనుగోలు చేయవచ్చు. గత ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్స్ చాన్స్ మిస్ చేసుకున్నవారికి ఇది మరో అద్భుత అవకాశం అనే చెప్పవచ్చు. ఐఫోన్ 14 ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరలో ఉన్నందున ఈ డీల్ మరింత ఆకర్షణీయంగా మారింది. ఇటీవలే ఆపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ని ప్రవేశపెట్టినప్పటికీ.. ఐఫోన్ 14 ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లతో కస్టమర్లకు అందుబాటులో ఉంది. కస్టమర్‌లు తమ పాత ఫోన్‌లను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా రూ.42వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

ఐఫోన్ 14 128GB మోడల్‌కు రూ.69,900 ఖర్చవుతుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ రూ.57,999కి విక్రయిస్తోంది. పాత ఫోన్‌ ఎక్స్చేంజ్ చేసుకుంటే.. ఫ్లిప్‌కార్ట్ లో రూ.42వేల వరకు తగ్గింపును అందిస్తుంది. దీంతో కేవలం రూ.15,999లోపు ఐఫోన్ 14ని సొంతం చేసుకోవచ్చు. అదనంగా కొన్ని క్రెడిట్ కార్డ్‌లు 10 శాతం తగ్గింపును అందిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement