Saturday, May 18, 2024

Toll Gateఈ విష‌యం తెలుసా… టోల్‌గేట్‌లో రూపాయి కూడా క‌ట్టావ‌స‌రం లేదు

టోల్ గేట్‌లో రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. టోల్ ప్లాజాలు రూల్స్ పాటించకుంటే కస్టమర్ ఎలాంటి ఛార్జ్ చెల్లించవద్దని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను జారీ చేసింది. వెహికిల్ ని బట్టి అక్కడ టోల్ ఛార్జ్ వసూలు చేస్తుంటారు.హైవే ప్రయాణాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్‌హెచ్ఎఐ కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఇందులో భాగంగా మే 2021లో 10-సెకన్ల నియమాన్ని ప్రవేశపెట్టింది.

చాలా టోల్ ప్లాజాలకు ఫాస్టాగ్‌ ఇంటిగ్రేషన్ ఉండటంతో ఈ 10సెకన్ల నియమాన్ని పొందుపరిచారు. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద రద్దీ సమయాల్లో కూడా ఒక్కో వాహనానికి 10 సెకన్లకు మించి నిరీక్షణ సమయం ఉండకూడదు.100 మీటర్ల కంటే ఎక్కువ వాహనాల క్యూలను నిరోధించడం ద్వారా టోల్ ప్లాజాల వద్ద సులభంగా ట్రాఫిక్ కదులుతుంది.వేచి ఉన్న క్యూ 100 మీటర్ల కంటే ఎక్కువ ఉంటే లేదా టోల్ బూత్‌కు చేరుకోవడానికి 10 సెకన్ల కంటే ఎక్కువ సమయం పట్టినట్లయితే వాహనాల నుండి టోల్ వసూలు చేయకూడదు. ప్రతి టోల్ లేన్‌లో టోల్ బూత్ నుండి 100 మీటర్ల పసుపు లైన్ మార్కింగ్ ఉండాలి.పెరుగుతున్న ఎలక్ట్రానిక్ టోల్ వసూళ్ల కారణంగా, ప్రయాణ సమయాన్ని తగ్గించాలని, అవాంతరాలు లేకుండా ప్రయాణం కొనసాగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సమర్థవంతమైన టోల్ సేకరణ కోసం రాబోయే 10 సంవత్సరాలలో ట్రాఫిక్ అంచనాలను పరిగణనలోకి తీసుకొనే ఎన్‌హెచ్ఎఐ కొత్త డిజైన్‌ ప్రవేశ పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement