Monday, April 29, 2024

ట్రయంఫ్‌ బైక్స్‌ విక్రయించనున్న బజాజ్‌…

బజాజ్‌ ఆటో మరో విదేశీ కంపెనీకి చెందిన మోటార్‌ సైకిళ్లను దేశంలో విక్రయించనుంది. బ్రిటన్‌కు చెందిన ట్రయంఫ్‌ మోటార్‌ సైకిళ్ల విక్రయాలు, మార్కెటింగ్‌ కార్యకలాపాలు వంటి వ్యవహారాలను ఇకపై బజాజ్‌ ఆటోనే చూడనుంది. ఇప్పటికే బజాజ్‌ ఆటో దేశంలో కేటీఎం బైక్స్‌ను, చేతక్‌ ఎలక్ట్రిక్‌ ్స, బజాజ్‌ ద్విచక్ర, త్రిచక్ర వాహన విక్రయ కాల్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇక నుంచి ట్రయంఫ్‌ వాహన విక్రయాలను బజాజ్‌ నిర్వహించనుంది. దీంతో ఐదు కంపెనీలకు బజాజ్‌ ప్రత్యేక డీలర్‌గా వ్యవహించనుంది. దీనిపై రెండు కంపెనీల మధ్య 2020లోనే ఒప్పందం కుదిరింది. రెండు కంపెనీలు కలిసి మిడ్‌ సైజ్‌ ట్రయంఫ్‌ మోటార్‌ సైకిళ్లను తీసుకు రావాలని నిర్ణయించాయి.

వీటిని బజాజ్‌ ఆటోకు చెందిన మహారాష్ట్రలోని చకన్‌ ప్లాంట్‌లో తయారు చేయనున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి ఈ మిడ్‌సైజ్‌ వాహనాలు మార్కెట్లోకి రానున్నాయి. బజాజ్‌ ఆటోకు దేశంలో 6 వేలకు పైగా డీలర్లు, సబ్‌ డీలర్లు ఉన్నారు. ఇక నుంచి బజాజ్‌ నెట్‌వర్క్‌లో ట్రయంఫ్‌ రిటైల్‌ ఛానల్‌గా చేరనుంది. ప్రస్తుతం ఉన్న ట్రయంఫ్‌ డీలర్‌ షిప్‌లు ఎప్పటిలాగే తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయి. ఈ ఒప్పందం ట్రయంఫ్‌ విస్తరణకు ఉపయోగపడుతుందని బజాజ్‌ ఆటో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేష్‌ శర్మ తెలిపారు. రానున్న రెండు సంవత్సరాల్లో ప్రత్యేకంగా ట్రయంఫ్‌ డీలర్‌షిప్‌లను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement