Friday, May 17, 2024

అదానీ కుటుంబం నుంచి నిధుల సేకరణకు ఓకే.. అంబుజా సిమెంట్స్‌ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం

ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ కుటుంబానికి సెక్యూరిటీస్‌ జారీ ద్వారా 20 వేల కోట్లు సేకరించాలన్న ప్రతిపాదనకు అంబుజా సిమెంట్స్‌ అసాధారణ జనరల్‌ బాడీ సమావేశం అమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాలని అంబుజా సిమెంట్స్‌ వాటాదార్లకు సంస్థాగత ఇన్వెస్టర్ల సలహా సంస్థ ఐఐఏఎస్‌ కోరింది. స్వతంత్ర డైరెక్టర్లుగా అమిత్‌ దేశాయ్‌, పుర్వి సేథ్‌ నియామక ప్రతిపాదనను కూడా తిరస్కరించాలని విజ్జప్తి చేసింది. శనివారం నాడు జరిగిన సమావేశంలో కంపెనీ ఛైర్మన్‌గా గౌతమ్‌ అదానీ, డైరెక్టర్‌గా ఆయన తనయుడు కిరణ్‌ అదానీ నియమాకానికి ఆమోదం లభించిందని కంపెనీ తెలిపింది. అంబుజా సిమెంట్స్‌ అసాధారణ సర్వసభ్య సమావేశంలో 12 తీర్మానాలపై వాటాదార్ల అనుమతిని సంస్థ కోరింది. అదానీ గ్రూప్‌కు చెందిన హర్మోనియా ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో 47.74 కోట్ల షేర్లను 418.87 రూపాయల ధరకు కేటాయించడానికి సమావేశం అంగీకరించింది. బోర్డు ప్రతిపాదించిన తీర్మానాలను సమావేశం 91.37 శాతం ఓట్లతో ఆమోదించారు. వీటిని ఒకటి లేదా పలు దఫాలుగా జారీ చేయడం ద్వారా 20,001 కోట్లను కంపెనీ సమీకరించనుంది.

బోర్డులో మరో ఇద్దరు డైరెక్టర్లు, నలుగురు స్వతంత్ర డైరెక్టర్లను నియమించే ప్రత్యేక ప్రతిపాదనను కూడా ఆమోదం లభించింది. సమావేశానికి గౌతమ్‌ అదానీ హాజరుకాలేదు. అయాన తనయుడు కిరణ్‌ అదానీ సమవేశానికి అధ్యక్షత వహించారు. అంబుజా సిఇమెంట్స్‌కు 50.05 శాతం వాటా ఉన్న ఏసీసీ సిమెంట్స్‌ ఎమర్జెన్సీ జనరల్‌బాడీ సమావేశం ఆదివారం నాడు జరగనుంది.
ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్ల నియామకంతో పాటు, అదానీ కుటుంబం నుంచి 20 వేల కోట్లు సేకరించే ప్రతిపాదనను వ్యతిరేకించాలని సంస్థాగత ఇన్వెసర్ల సలహా సంస్థ కోరింది. ప్రస్తుతం మార్కెట్‌లో కంపెనీ షేరు ధర 500.20 రూపాయల కంటే వారెంట్ల జారీ ధరను 418.87రూపాయలు చాలా తక్కువ. అందుకే దీన్ని వ్యతిరేకించాలని కోరింది. సమావేశంలో బోర్డు ప్రతిపాదించిన మొత్తం 12 తీర్మానాలకు ఆమోదం లభించిందని అంబుజా సిమెం ట్‌ ప్రకటించింది. అదానీ కుటుంబానికి 47.74 కోట్ల వారెంట్స్‌ను ఒక్కోదాన్ని 418.87 రూపాయలకు కేటాయించేందుకు కూడా సమావేశం ఆమోదం తెలిపింది. అదానీ గ్రూప్‌ అంబుజా, ఏసిసి సిమెంట్స్‌ కంపెనీలను 53,800 కోట్లతో కొనుగోలు చేసింది. ఈ ప్రక్రియ గత నెలలో పూర్తయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement