Friday, May 3, 2024

YCP .. రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు, పెద్దల సభకు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు ,జంగాలపల్లి శ్రీనివాస్..

ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ తమ అభ్యర్ధులను ఖరారు చేసింది. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు (ఎస్సీ), జంగాలపల్లి శ్రీనివాస్ (బలిజ)లను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ మేరకు ముగ్గురు నేతలకు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆమోదముద్ర వేశారు.

గతంలో ఏపీ నుంచి రాజ్యసభకు వైసీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి సీఎం రమేష్, కనకమేడల రవీంద్ర కుమార్ ఎంపికయ్యారు. త్వరలో వీరి ముగ్గురి పదవీ కాలం ముగియనుండటంతో మూడు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బలం నేపథ్యంలో మూడు స్థానాలు వైసీపీ దక్కించుకునే అవకాశం వుంది. దీంతో పెద్దల సభలో వైసిపి బలం 11 కి పెరగనుంది ..

Advertisement

తాజా వార్తలు

Advertisement