Friday, June 14, 2024

AP | ఉరి తాళ్లతో మునిసిపల్ కార్మికుల నిరసన..

నందికొట్కూరు (ప్రభ న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని నందికొట్కూరు మున్సిపాలిటీలో కార్మికులు ఉరి తాళ్లతో నిరసన కార్యక్రమం నాలుగో రోజు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరావు సిఐటియు పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడుతూ.

రాష్ట్ర ప్రభుత్వంతో గురువారం 28వ తేదీ సిఐటియు ఉమామహేశ్వరరావు నాయకత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రభుత్వ ప్రతినిధులు కోటేశ్వరరావు వాసుదేవరావు చర్చలు జరిగాయని ప్రభుత్వం ముందు 13 డిమాండ్లు పెట్టడం జరిగిందని.. కానీ ప్రభుత్వం ఏ దానికి స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటేవేశారని వారు ఆరోపించారు.

జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు కాంట్రాక్ట్ కార్మికులను ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చి మడవతిప్పారని వారు ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు కోరారు ఆప్కాస్ లో పనిచేస్తున్న 90 వేల మంది కార్మికులను రెగ్యులర్ చేయాలని వారి డిమాండ్ చేశారు.

- Advertisement -

ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ రిస్క్ అలవెన్స్లు క్లబ్ డ్రైవర్లకు 18,500 వేతనాలు పెంచాలని వారి డిమాండ్ చేశారు , డైలీ వేజ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని వారు కోరారు, ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి బేస్తరాజు సిఐటి నాయకులు నాగన్న ఆంజనేయులు మున్సిపల్ వర్కర్ సీనియర్ నాయకులు పరమేష్ శ్రీను నాగేశ్వరరావు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement