Friday, May 17, 2024

పిల్లలతో సహా కెనాల్ లో దూకిన మహిళ.. కాపాడిన హెడ్ కానిస్టేబుల్

గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఇద్దరు పిల్లలతో ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. విజయవాడకు చెందిన రుద్ర వరపు శాంతిప్రియ తన ఇద్దరు పిల్లలతో సహా బకింగ్ హోమ్ కెనాల్ లో దూకి ఆత్మహత్య ప్రయత్నించింది. అయితే అప్పుడే విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న కృష్ణానది చెక్ పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు వీరిని గమనించాడు. వెంటనే స్థానిక మత్స్యకారుల సహాయంతో ముగ్గురిని కాపాడారు. తల్లి పిల్లలతో సహా ప్రాణాలతో ముగ్గురు దక్కడంతో ఊపిరిపీల్చుకున్నారు స్థానికులు. రుద్ర వరపు శాంతి ప్రియ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి తల్లి పిల్లల్ని తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అప్పజెప్పారు కానిస్టేబుల్ నాగేశ్వరరావు. కుటుంబ కలహాల వల్లే మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించిందని హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరావు చెబుతున్నారు. బకింగ్ హోమ్ కెనాల్ నుంచి ముగ్గురు ని కాపాడిన మత్స్యకారులు “హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు” కి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపిన బాధితురాలి కుటుంబ సభ్యులు. ఈ ఆత్మహత్య ప్రయత్నం పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన తాడేపల్లి పోలీసులు.

ఇది కూడా చదవండి: ఏపీలో రోడ్లు బాగుచేయాలంటూ జనసైనికుల ఉద్యమం

Advertisement

తాజా వార్తలు

Advertisement