Friday, May 3, 2024

2024 నాటికి పోలవరం పూర్తయ్యేనా?.. పరిష్కారంకాని నిర్వాసితుల సమస్య

పోలవరం, ప్రభన్యూస్‌: పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం 2024 సంవత్సరం వరకూ సాధ్యమయ్యే పరిస్థితి కానరావడం లేదు. పోలవరం ప్రాజెక్ట్‌ పనులు పరిశీలించడానికి వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలోని జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ సుమారుగా పది సార్లు ప్రాజెక్ట్‌ ప్రాంతాన్ని సందర్శించారు. అయినా ఏ సమస్య పరిష్కారం కాకుండా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు- ఉన్నాయి. ముఖ్యంగా గిరిజన నిర్వాసితులు తమ సమస్యలు తీరక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి, కోర్టు మెట్లు- ఎక్కుతున్నారు. నిర్వాసితుల సమస్యలు అటు-ంచితే ప్రాజెక్టు పనులు కూడా వేగవంతం కాలేదు. 2019-20 సంవత్సరంలో వచ్చిన ఉధృత గోదావరి వరదలలో ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్న విషయంపై కూడా అంతంత మాత్రమే మంత్రి స్పందించారనే ఆరోపణలున్నాయి.

ప్రతిపక్ష నేతలను విమర్శించడానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని నిర్వాసితుల అంటున్నారు. కొత్తగా జలవనరుల శాఖ మంత్రిగా పదవి చేపట్టిన అంబటి రాంబాబు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు.. ఈ సందర్భంగా డయాఫ్రం వాల్‌ దెబ్బతినడానికి తెలుగుదేశం ప్రభుత్వమే కారణమని ఆరోపణలు చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారని, నిర్వాసితుల సమస్యలపై శ్రద్ధ చూపించలేదని నిరసిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పునరావాస గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు, వారి సమస్యలు తీర్చడానికి, పోలవరం వేగవంతం కావడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement