Monday, April 29, 2024

ఎవ‌రు త‌ప్పు చేసినా ఉపేక్షించేది లేదు : ఏపీ హోంమంత్రి

తప్పుచేసిన వారెవరైనా సరే ఉపేక్షించేది లేదన్న ఉద్దేశ్యంతో ఎమ్మెల్సీని అరెస్టు చేశామని ఏపీ హోంమంత్రి తానేటి వ‌నిత అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్యకేసుపై ఆమె స్పందించారు. కాకినాడ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనంతబాబును అరెస్టు చేసి పేదలు, బడుగు, బలహీన వర్గాల పక్షాన ప్రభుత్వం నిలిచిందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement