Tuesday, November 28, 2023

TDP అంటే తెలుగు బూతుల పార్టీ.. సీఎం జగన్

టీడీపీ అంటే తెలుగు బూతుల పార్టీ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త నిర్వచనాన్ని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆక్వా వర్శిటీ, బియ్యపు తిప్ప ఫిషింగ్ హార్బర్, రూ.1400కోట్లతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు సీఎం శంకు స్థాపన చేశారు.

- Advertisement -
   

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దత్తపుత్రుడి పార్టీని రౌడీసేనగా మార్చారన్నారు. వాళ్ల పాలనను చూసి జనం ఇదేం ఖర్మరా బాబూ అనుకున్నారన్నారు. అందుకే 2019లో జనం వారికి బైబై చెప్పేశారన్నారు. కుప్పంలోనూ గెలవలేననే భయం చంద్రబాబులో కనిపిస్తోందన్నారు. నిరాశ చంద్రబాబు మాటల్లో కనిపిస్తోందన్నారు. ఓట్లు అడిగేందుకు చెప్పుకునేందుకు ఏమీ లేదన్నారు. అందుకే చంద్రబాబు, దత్తపుత్రుడు కలిసి కుట్రలు చేస్తున్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement