Thursday, February 22, 2024

Denduluru : జనసేన ఇంచార్జ్ భర్త అనుమానాస్పద మృతి

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని మూడో పట్టణ పరిధిలో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తి దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ వెంకటలక్ష్మి భర్తగా గుర్తించారు.

అయితే గత కొంతకాలంగా వీరిరువురు విడిగా ఉంటున్నట్లు సమాచారం. అయితే ఆయన సాధారణంగా మృతిచెందాడా లేదా మరే ఇతర కారణాల వల్ల అయినా మృతి చెందాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement