Monday, May 6, 2024

Welcome – జన సేన లో కొణతాల చేరికను స్వాగతించిన పవన్ కల్యాణ్

అమరావతి – జనసేన పార్టీలో కొణతాల రామకృష్ణ చేరడాన్ని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించారు. ఆయన సేవలు జనసేన పార్టీకి ఉపయోగపడతాని చెప్పారు. జనసేన పార్టీలో చేరేందుకు కొణతాల నిర్ణయించుకోవడం హర్షణీయమని పవన్ కళ్యాణ్ అన్నారు. సుదీర్ఘకాలంగా కొణతాల రామకృష్ణ రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు. అలాంటి నాయకుడు జనసేన పార్టీలో చేరడం మంచి పరిణామం అని పేర్కొన్నారు. కొణతాల రామకృష్ణను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక లేఖను విడుదల చేశారు.

క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం గురించి, రాష్ట్రాభివృద్ధి గురించి స్పష్టత ఉన్న నాయకుడు కొణతాల రామకృష్ణ అని పవన్ కళ్యాణ్‌ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు, నాయకులు ద్విగుణీకృత ఉత్సాహంతో పనిచేసేందుకు , పార్టీ మరింత బలోపేతం అయ్యేందుకు కొణతాల సేవలు దోహదమవుతాయని పవన్ కళ్యాణ్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement