Wednesday, May 1, 2024

Water Dispute – కృష్ణా, గోదావ‌రి జలాల త‌ర‌లింపుపై ఎపి వ‌ర్రీ… హ‌క్కులు కాపాడుకునేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం ..

అమరావతి, ఆంధ్రప్రభ: కృష్ణాజలాల పున:పంపిణీ పై కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆదేశాలపై తీవ్ర అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాలకు తరలి పోతున్న గోదావరి జలాలను పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి పదేళ్ళు కావస్తున్నా పునర్విభజన హామీల్లో ఒక-టైన గోదావరి జల వివాదా ల పరిష్కార -టైబ్యునల్‌ (జీడబ్ల్యుడీటీ- – గోదావరి -టైబ్యునల్‌)ను ఇంతవరకు ఏర్పాటు- చేయకపోవటంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. తక్షణం -టైబ్యునల్‌ను ఏర్పాటు- చేసిన రెండు రాష్ట్రాలకు గోదావరి జలాలను కేటాయించాలని డిమాండ్‌ చేస్తోంది. గోదావరికి దిగువన ఉన్న ఏపీకి మిగులు జలాలపై సంపూర్ణ హక్కులున్నాయి.. బచావత్‌ -టైబ్యునల్‌ కల్పించిన హక్కులకు భిన్నంగా గోదావరి నీళ్లను తెలంగాణ తరలించుకుపోతున్నా కేంద్ర జలశక్తి నుంచి స్పందన కానరావటం లేదని ఏపీ భావిస్తోంది. బచావత్‌ -టెబ్యునల్‌ ఉమ్మడి రాష్ట్రానికి 1430 టీ-ఎంసీల నికరజలాలను కేటాయించింది. నీటి లభ్యత 75 శాతం కన్నా అధికంగా ఉన్నపుడు మిగులు జలాల వినియోగంపై పూర్తిస్థాయి హక్కులు ఏపీకి ఉంటాయని బచావత్‌ స్పష్టం చేసింది. 2014లో రాష్ట్రం విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లుగా ఏర్పడ్డాక అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన నీటిని ప్రాజెక్టుల ప్రాతిపదికన పంపిణీ చేయాల్సి ఉంది. అందులో ఏపీకి 776, తెలంగాణకు 650 టిఎంసిలు రావాలి.

తెలంగాణలో పెరిగిన నీటివాడకం
ఇపుడు తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలను నిర్మించి మిగులు జలాలను దారి మళ్ళించటం వల్ల తమ వాటా నీటిని వాడుకోలేకపోతుందని ఏపీ వాదిస్తోంది. ఈ మేరకు ఎగువ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్మించిన ప్రాజెక్టులు, దారిమళ్ళుతున్న నీటిపై విస్పష్టమైన నివేదికను రాష్ట్ర జలవనరుల శాఖ గతంలోనే కేంద్ర జలశక్తికి అందించింది. ప్రత్యేకించి గోదావరి నుంచి తెలంగాణలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మూడో టీ-ఎంసీని అనుమతించటంపై ఏపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ- (టీ-ఏసీ) కాళేశ్వరానికి 2 టీ-ఎంసీల గోదావరి జలాలను తరలించేందుకు 2018 జూన్‌ 6న అనుమతించింది. గోదావరిలో వాటాలు తేలకుండా 2 టీ-ఎంసీలకు అనుమతి ఇవ్వటం కూడా తప్పే. నిబంధనలకు విరుద్ధంగా జారీ అయిన అప్పటి అనుమతులను సైతం పున:సమీక్షించాలని తాము డిమాండ్‌ చేస్తున్న సమయంలో కాళేశ్వరానికి మూడో టీ-ఎంసీ తరలింపు ప్రతి పాదన తెరమీదకు రావటం వాంఛనీయం కాదని ఏపీ అంటోంది. మూడో టీ-ఎంసీకి సంబంధించిన కాళే శ్వరం విస్తరణ పనులకు అనుమతి నిరాకరించాలని ఏపీ డిమాండ్‌ చేస్తోంది.

గోదావరిలో ఏపీకి 1238 టీ-ఎంసీల హక్కు
బచావత్‌ -టైబ్యునల్‌ ను అనుసరించి గోదావరి బేసిన్‌ కు దిగువన ఉన్న ఏపీకి మిగులు జలాలపై సంపూర్ణ హక్కులున్నాయి..నిర్మాణంలో ఉన్న పోలవరంతో పాటు- ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులకు బచావత్‌ -టైబ్యునల్‌ గతంలోనే 737.153 టీ-ఎంసీలను కేటాయించింది. 75 శాతం నీటి లభ్యతను ఆధారం చేసుకుని ఇపుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 165 టీ-ఎంసీలు అవసరం. వరదల జలాలపై తమకున్న హక్కును వినియోగించుకుని మరో 336 టీ-ఎంసీలను వినియోగించునే సామర్థ్యంతో ప్రాజెక్టులు నిర్మిస్తామని ఏపీ ఇప్ప టికే ప్రతిపాదనలు పంపించింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా గోదావరి జలాల్లో 1238.436 టీ-ఎంసీలను ఏపీకి దక్కుతాయని అంచనా.

- Advertisement -

ట్రిబ్యునల్‌ ఊసు పట్టని కేంద్రం
తెలంగాణలో కొత్త ప్రాజెక్టులకు అనుమతులివ్వవద్దని ఏపీ చెబుతోంది. ఈమేరకు గతంలోనే కేంద్ర జలశక్తి కార్యదర్శి పంకజ్‌ కుమార్‌కు ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గోదావరి జలాలపై ఏపీకి ఉన్న హక్కులను రక్షించుకునే విషయంలో రాజీలేని ధోరణితో వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది ప్రత్యేకించి గోదావరి ట్రిబ్యునల్‌ ఏర్పాటు- చేయటంతో పాటు- రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపుల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలని ఏపీ డిమాండ్‌ చేస్తోంది. 2020 అక్టోబరు 6న నిర్వహించిన కేంద్ర జలశక్తి అపెక్స్‌ కౌన్సిల్‌లో గోదావరి -టైబ్యునల్‌ ఏర్పాటు- చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కోరారు. రెండు రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపితే అంతర్‌ రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం ప్రకారం -టైబ్యునల్‌ ఏర్పాటు -చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చెబుతున్నా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు

.పెండింగ్‌ స్థానాలకు అభ్యర్థులు దాదాపు ఖరారు
బీఆర్‌ఎస్‌ జరుగుతున్న పరిణామాలను అన్ని కోణాల్లో పరిశీలించిన సీఎం కేసీఆర్‌ పెండింగ్‌లో పెట్టిన అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులు దాదాపు ఖరారు అయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తులను బుజ్జగించి బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం కృషి చేసేలా అన్ని ఏర్పాట్లు- చేసుకున్నారు. ఇక తరువాయి అభ్యర్థుల పేర్లు ప్రకటించడమే మిగిలి ఉంది. పెండింగ్‌లో ఉన్న జనగామ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సాపూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి సునీతా లక్ష్మారెడ్డి, నాంపల్లి స్థానం నుంచి ఆనంద్‌గౌడ్‌, గోషామహల్‌ నుంచి గోవింద్‌ రాటే పేర్లు ప్రకటించే చాన్స్‌ ఉంది. ఇక మల్కాజిగిరి నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ- చేయాల్సిన మైనంపల్లి పార్టీ మారడంతో ఆ స్థానానికి కూడా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో మల్కాజిగిరి నుంచి మర్రి రాజశేకర్‌రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, అక్టోబర్‌ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సభలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధమయ్యారు. ఒకసారి ప్రజాక్షేత్రంలో అడుగు పెడితే తీరికలేని పరిస్థితులు ఉంటాయన్న కోణంలో ప్రచారానికి బయలుదేరే ముందుగానే కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement