Friday, May 10, 2024

ఉక్రెయిన్‌లో యుద్ధం – ఏపీలో నూనె రేట్లు పెరుగుదల

జగ్గయ్యపేట : ఉక్రెయిన్‌లో యుద్ధం నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో వంట నూనె రేట్లు అమాం తంగా పెరిగిపోయాయి. గురువారం ఉదయం యుద్దం ప్రారంభం కావడంతో యుద్ధం సాకుగా చూపి జిల్లాలోని పలు ప్రాంతాలలో వంటకు ఉపయోగించే వివిధ కంపెనీల నూనెల ధరలను విక్రయదారులు రూ.10 నుండి రూ. 20 లకు పెంచి విక్రయాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పామాయిల్‌, రిఫండాయిల్‌ ప్యాకెట్‌కు రూ. 10 నుండి రూ.20 కి పెరిగాయి. మంగళవారం వరకు మామూలు రేట్లు ఉన్న నూనెల ప్యాకె ట్‌ ధరలు లీటర్‌కు మంగళవారం నుండి బుధవారానికి రూ. 5 నుండి 10 తేడాతో విక్రయించగా గురువారం పామాయిల్‌, రిఫండాయిల్‌ ప్యాకెట్ల ధరలు రూ. 5 నుండి రూ.10 లు పెం చారు. గత రెండు రోజుల వ్యవధిలో రూ.15 ల ధరల పెంపుతో అమ్మకాలు కొనసాగిస్తున్నా రు. కొందరు వేరుశెనగ నూనెలను కూడా స్టాకు లేవంటూ రూ.5 లకు పెంచి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. కొందరు స్వార్ధపరులు తమ లాభాపేక్షతో ఎమ్మార్పీ కన్నా ఎక్కువగా విక్రయిస్తున్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న దుకాణాల వారు ఈవిధంగా చేస్తున్నారు. వెంటనే పౌర సంబంధిత అధికారులు ఎమ్మార్పీకే విక్రయించాలని వినియోగదారులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement