Friday, May 17, 2024

Visakhapatnam – 24 గంట‌ల‌కు పైగా బీచ్ రాళ్ల మ‌ధ్య‌లో యువ‌తి మృత్యువుతో పోరాటం ….బతకాలని ఆరాటం

విశాఖపట్నం: విశాఖపట్నంలోని అప్పికొండ బీచ్‌లో ఓ యువతి రాళ్ల మధ్య చిక్కుకుని అపస్మారక స్థితిలో మృత్యువుతో పోరాడింది. అదృష్టవశాత్తు యువతిని స్థానికులు గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన కావ్య.. ఫ‌ణీంద్ర తో కలిసి ఈ నెల 2 నుంచి అప్పికొండ శివాలయ పరిసరాల్లో ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం తీరం దగ్గరలో ఉన్న రాళ్ల గుట్టలపై ఆమె ఫొటో తీసుకుంటున్న క్రమంలో కిందపడిపోయింది. ఎత్తైన ప్రదేశం నుంచి జారి పడిపోయింది. ఈ క్రమంలో కా​వ్య అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఫ‌ణీంద్ర‌ అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటికే రాత్రి కావడంతో కావ్య రాళ్ల మధ్యలో నుంచి కేకలు వేసింది.

ఫ‌ణీంద్ర ఎక్కడ..
బీచ్‌లో రాత్రివేళ జన సంచారం లేకపోవడంతో అలాగే రాత్రంతా మృత్యువుతో పోరాడింది. సోమవారం ఉదయం బీచ్‌కు వచ్చిన కొందరు జాలర్లు యువతిని చూడగా అక్కడే ఉన్న గజ ఈతగాళ్ల సహాయంతో అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. యువతి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం 108 వాహనంలో కావ్యను కేజీహెచ్‌కు తరలించారు. ఈ సందర్బంగా తాను కాలుజారి రాళ్ల మధ్య పడిపోయానని.. ఫ‌ణీంద్ర‌ ను ఏమీ అనవద్దని ఆమె పోలీసులు కోరడం విశేషం. ఇక పరారీలో ఉన్నఫ‌ణీంద్ర కోసం పోలీసులు గాలిస్తున్నారు. అంబులెన్సు సిబ్బంది యువతి తల్లికి సమాచారమివ్వగా.. వారు విశాఖ బయలుదేరి వెళ్లారు.

ఇదిలా ఉంటే తమ కుమార్తె కనపడటంలేదని యువతి తల్లి మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.. ఇంతలో పీఎస్‌ నుంచి అంబులెన్స్‌ సిబ్బందికి సమాచారమిచ్చారు. దువ్వాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కేసు గురించి గాజువాక సౌత్ ఎసిపి త్రీనాథ్ మాట్లాడుతూ, నిన్న అప్పికొండ సముద్ర తీరంలో ఓ అమ్మాయి పడిపోయి ఉంటే స్థానికంగా ఉన్న మత్యకారులు రక్షించారు.. కాలికి బలమైన గాయాలు కావడంతో కెజిహెచ్ కు తరలించాం. బాధ్యత యువతి పై మచిలిపట్నం ఇనుగుదురుపేట పిఎస్ లో మిస్పింగ్ కేసు నమెదు అయ్యింది. ఫణీంద్ర అనే యువకుడితో గత నెల 29న విశాఖకు కలిసి వచ్చారు.. గోపాలపట్నం నాయుడుగార్డెన్ లాడ్జిలో ఉన్నారు. ఈ నెల 2వ తేదిన అప్పికొండ శివాలయంకు వచ్చి పెళ్లి చేసుకున్నారు.. పెళ్లి తరువాత అరకు వెళ్లి అక్కడ కొద్ది రోజులు ఉన్నారు. ఈ నెల 8వ తేదిన మరల అప్పికొండ శివాలయంకు వచ్చారు..అక్కడే శివాలయం వద్ద దర్శనం చేసుకోని వస్తున్న సమయంలో సముద్రంలో అమ్మాయి కాలు జారీ పడిందని యువతి స్టెట్మెంట్ ఇచ్చింది. ఇందులో ఎవ్వరి ప్రమేయం లేదని చేప్పింది. యువతి తాలుకు పెరెంట్స్ వచ్చారు ఇనుగుదురుపేట పోలీసులు సెట్మెంట్ రికార్డు చేసుకున్నారు. యువతిని కెజిహెచ్ నుండి డిశార్చ్ చేసి తల్లిదండ్రులకు అప్పగించాం. యువకుడు అచూకీ తెలియాల్పి ఉంది…కేసు ఇనుగుదురుపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు….

Advertisement

తాజా వార్తలు

Advertisement