Monday, April 29, 2024

Tirumala: క్యూ కడుతున్న విఐపిలు…సర్వదర్శనం నిలిపివేత

ఏపి,తెలంగాణ,కర్నాటక,తమిళనాడు రాష్ర్టాల నుంచి 35 మంది జడ్జిలు రానున్నారు. ఇప్పటికే తిరుమలకు ముగ్గురు మంత్రులు,ఏపి అసెంబ్లి డిప్యూటి స్పీకర్ చేరుకున్నారు. ఇవాళ రాత్రికి తిరుమలకు మరో 12 మంది మంత్రులు,ఏపి అసెంబ్లీ స్పీకర్ రానున్నారు.

రాత్రికి తిరుమలకు మరో 18 మంది సభ్యులు చేరుకోనున్నారు. అలాగే ఎంపిలు,ఎమ్మేల్యేలు,ఎమ్మెల్సీలు కూడా స్వామివారి ద‌ర్శ‌నానికి రానున్నారు. విఐపిలకు వసతి గదులు కేటాయించలేక రిషేస్పన్ అధికార్లు తలలు పట్టుకుంటున్నారు. వసతి గదులు కోసం టిటిడి పై ఒత్తిడి పెరుగుతుంది. సర్వదర్శనం టోకెన్ల కోసం భారీగా క్యూలు క‌ట్టారు. ప్రస్తూతం 26వ తేదికి సంభందించిన దర్శన టోకేన్లు టిటిడి కేటాయించింది.
సర్వదర్శనం నిలిపివేత
సర్వదర్శన క్యూలైనులోకి భక్తులకు అనుమ‌తిని నిలిపివేసింది. దీంతో తిరుమలలో శ్రీవారి సర్వదర్శనంపై గందరగోళం నెలకొంది. శుక్రవారం టికెట్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చిన భక్తులను తితిదే అధికారులు క్యూలైన్లలోకి అనుమతించడం లేదు. దీంతో ఏటీసీ వద్ద తితిదే విజిలెన్స్‌ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు.

శనివారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయణ గిరి షెడ్లు నిండిపోయి.. నారాయణగిరి అతిథి గృహం వరకు క్యూలైన్‌ చేరుకుంది. దీంతో వైకుంఠద్వార దర్శనానికి ఇబ్బంది కలుగుతుందని భావించి, టోకెన్లు లేని వారిని దర్శనానికి తితిదే అధికారులు నిరాకరించారు. రేపటి సర్వదర్శన టికెట్లు ఉన్న వారిని సాయంత్రం క్యూ లైన్లలోకి పంపిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement