Monday, April 29, 2024

Tirumala: ఇక‌ వీఐపీ బ్రేక్‌ దర్శన టిక్కెట్లు ఆన్ లైన్ లోనే…. గంట‌ల నిరీక్ష‌ణ‌కు తెర ..

వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల కోసం ఇంతకుముందు తిరుమల శ్రీవారి భక్తులు నానా అగచాట్లు పడేవారు. గతంలో వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను జారీ చేసేందుకు తొలుత భక్తుల వివరాలను నమోదు చేసుకుని రసీదు ఇచ్చేవారు. ఆ తర్వాత ‘ఎంబీసీ 34’ కౌంటర్ వద్ద గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడి.. నగదు లేదా యూపీఐ, కార్డ్‌ ద్వారా చెల్లించి భక్తులు టికెట్‌ను పొందేవారు.

ఈక్రమంలో భక్తుల ఎంతో సమయం వేస్ట్ అయ్యేది. ఇకపై ఇంత వెయిటింగ్ అక్కర్లేదు. ఎందుకంటే.. తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లు ఇకపై ఆన్‌లైన్‌లోనూ లభించనున్నాయి.

ఇలా పొందాలి…
సిఫార్సు లేఖలు అందజేసిన భక్తుల మొబైల్‌కు ఓ లింక్‌తో కూడిన మెసేజ్‌ను పంపుతారు. భక్తులు ఆ లింకు క్లిక్‌ చేస్తే పేమెంట్‌ ఆప్షన్‌ వస్తుంది. అక్కడ ఆన్‌లైన్‌లో నగదు చెల్లిస్తే వెంటనే టికెట్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల జారీ కోసం గత మూడు రోజులుగా టీటీడీ ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలుచేస్తోంది. భక్తుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకొన్న తర్వాత పూర్తిస్థాయిలో ఈ పద్ధతిని అమల్లోకి తేనున్నారు. ఇప్పటికే ఆర్జిత సేవలకు కరెంట్‌ బుకింగ్‌ లక్కీడిప్‌లో టికెట్‌ పొందిన భక్తులు ఎస్‌ఎంఎస్‌ పేలింక్‌ ద్వారా నగదు చెల్లించి దర్శన టికెట్‌ను పొందుతున్నారు. ఇదే విధానాన్ని వీఐపీ బ్రేక్‌ దర్శనానికి ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement