Saturday, March 2, 2024

Regional Passport Office- విజయవాడ కేంద్రంగా రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం

ఎన్టీఆర్, ప్రభ న్యూస్ బ్యూరోః
విదేశాలకు వెళ్లే వారికోసం పాస్‌పోర్టుసేవలు మరింత సులభతరం చేసే క్రమంలో అతి త్వరలో మరో రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు విజయవాడ రీజినల్ పాస్‌పోర్టుఅధికారి శివహర్ష ప్రకటించారు. ప్రస్తుతమున్న పాస్‌పోర్టు సేవా కేంద్రానికి అదనంగా బందర్ రోడ్ లో మరో రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని ఒక హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివహర్ష మాట్లాడుతూ ప్రస్తుతం మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో రీజనల్ పాస్పోర్ట్ సేవా కేంద్రానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నామన్నారు.

త్వరితగతిన పాస్‌పోర్టు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రోజుకు రెండువేల కు పైగా అప్లికేషన్ల వస్తున్నట్లు చెప్పిన ఆయన అక్టోబర్ నెల ఆఖరి వరకు 3 లక్షలకు పైగా పాస్పోర్టులను జారీ చేసినట్లు తెలిపారు. పోస్టల్ పోలీస్ శాఖల భాగస్వామ్యంతో పాస్‌పోర్టును త్వరితగతిన అందించే ఏర్పాటు చేశామన్నారు. ఇకనుండి విజయవాడ రీజినల్ ఆఫీస్ కేంద్రంగానే పాస్‌పోర్టు ప్రింటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. విజయవాడ కేంద్రంగా మరో కార్యాలయం ప్రారంభం అవడంతో పాస్‌పోర్టు సేవలు సులభతరమై వినియోగదారులకు త్వరితగతిన పాస్‌పోర్టు అందే సౌలభ్యం కలుగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement